అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

రిపోర్టర్: సురేష్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంత్‌పూర్‌ అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. పిల్లలకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించాలని, ప్రీ-స్కూల్ విద్య అందేలా సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.