తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

రిపోర్టర్: రాజేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంపై అర్నబ్ తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ ఇరవై ఏడు, ఇరవై ఎనిమిది తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారికంగా ప్రకటించారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఇరవై నాలుగు గంటల వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.