అస్సాంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణ హత్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: అస్సాం

అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాలోని మారియానిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో అనిల్ రాజ్‌ఘర్ అనే 31 ఏళ్ల వ్యక్తిని దారుణంగా హత్య చేసి తల నరికిన ఘటన కలకలం రేపింది. సెప్టెంబర్ 7న అదృశ్యమైన బాధితుడి మృతదేహం సెప్టెంబర్ 11న భోగ్దోయ్ నదీ తీరంలో లభ్యమైంది. ఈ ఘటనకు సంబంధించి కపిల్ కర్మాకర్, ఆయన భార్య అనిమ కర్మాకర్, తమ్ముడు సంజిత్ కర్మాకర్, వారి స్నేహితుడు మహేష్ రాజ్‌ఘర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.