ఖమ్మం పోలీస్ శాఖలో విస్తృత బదిలీలకు వేగంగా కసరత్తు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం పోలీస్ శాఖలో ఏళ్లుగా తిష్ట వేసిన అధికారుల బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. నగరంలో పనిచేస్తున్న పలువురు సీఐలకు స్థానచలనం కల్పించారు. త్వరలో డివిజన్ మరియు జిల్లా స్థాయి అధికారుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం అందుతోంది.