సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: రమేష్ స్థలం: అల్లూరి సీతారామరాజు

సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అల్లూరి పోలీస్ శాఖ స్పష్టం చేసింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, అనుమానాస్పద లింక్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పేర్కొంది. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేని అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను, యాప్లను మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించింది. ఆన్లైన్ మోసాల బారిన పడితే వెంటనే 1930 నంబర్కు లేదా స్థానిక పోలీసులను ఆశ్రయించాలని స్పష్టం చేశారు.