లేహ్ లో సోనమ్ వాంగ్చుక్ పాఠశాలకు లడఖ్ యంత్రాంగం మరో భారీ షాక్

రిపోర్టర్: సురేష్ స్థలం: Leh

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ సతీమణి డాక్టర్ గీతాంజలి జె అంగ్మో నిర్వహిస్తున్న డెజర్ట్ ఫ్లవర్ స్కూల్ నిర్వహణను నిలిపివేయాలని లడఖ్ యంత్రాంగం స్పష్టం చేసింది. తగిన అనుమతులు లేకుండానే పాఠశాల తరగతులు ప్రారంభమైనట్లు లేహ్ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వచ్చే వరకు యథాస్థితిని కచ్చితంగా పాటించాలని అధికారులు ఆమెను ఆదేశించారు.