స్నేహితుడి మోసం వల్ల జీరో స్థాయికి పడిపోయాను అంటున్న తమన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 2016లో సరైనోడు సినిమా తర్వాత తనకు ఆర్థిక సమస్యలు తలెత్తాయని, ఒక స్నేహితుడిని నమ్మి మోసపోయి ఉన్నదంతా కోల్పోయి జీరో స్థాయికి వచ్చానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బియ్యం కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేవని తెలిపారు. ఆ కష్టకాలంలో మహానుభావుడు, భాగమతి, తొలిప్రేమ సినిమాలు తనను మళ్లీ నిలబెట్టాయని తమన్ వెల్లడించారు.