ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 19న వెల్లడవుతుండగా ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ మరియు ఎన్ఎస్ఐఐ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో గత మూడేళ్లలో అత్యధికంగా 40.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాల వెల్లడి తర్వాత ఎలాంటి విజయయాత్రలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.