ఆస్తి పన్ను పేరుతో గత ప్రభుత్వం సాగించిన నిలువ దోపిడీ

రిపోర్టర్: హరి స్థలం: విజయనగరం

గత ప్రభుత్వ హయాంలో ఆస్తి పన్ను పేరుతో పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ఆర్థికభారం మోపారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. విలువ ఆధారిత పన్ను విధింపు కింద ఏటా పదిహేను శాతం చొప్పున పెంచుతూ జీవోలు విడుదల చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అధికారులు తెలిపారు. విజయనగరం, బొబ్బిలి, రాజాం ప్రాంతాల్లో ఈ విధానం వల్ల పన్నుల మోత మోగిందని నిపుణులు పేర్కొన్నారు.