ముంబై అర్ధరాత్రి క్యాబ్ ప్రయాణం: మహిళ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ
రిపోర్టర్: అశోక్
స్థలం: ముంబై
ముంబైలో అర్ధరాత్రి సమయంలో క్యాబ్ లో ప్రయాణించిన అపూర్వ అనే యువతి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. రాత్రి సమయంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎల్లప్పుడూ భద్రతపై ఆందోళన చెందాల్సి వస్తుందని, మహిళా డ్రైవర్ కారణంగా తాను ప్రశాంతంగా ప్రయాణించి ఒక పురుషుడిలా స్వేచ్ఛగా అనుభూతి చెందానని ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.