సెల్ఫోన్ దొంగతనం అనుమానంతో దారుణ హత్య వెలుగులోకి
రిపోర్టర్: మహేష్
స్థలం: Veldurti
మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో సెల్ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో బ్యాగరి రామానుజంపై ప్రవీణ్ కుటుంబ సభ్యులు కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనపై ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.