నెట్టింట షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ షూటింగ్ స్పాట్ ఫొటోలు లీక్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ముంబై

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా సుజయ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ కింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె నటిస్తుండగా, షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా షారుఖ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, యాక్షన్ సీన్స్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.