ఏసీబీ అధికారుల చిక్కిన జీహెచ్ఎంసీ అధికారిణి: నాలుగు లక్షలు లంచం తీసుకుంటూ పట్టివేత
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ మెహదీపట్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న తులసీరామ్ సునీత ఏసీబీ అధికారులకు చిక్కారు. నిర్మాణ అనుమతి కోసం నాలుగు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. ఆమె నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ స్పష్టం చేశారు.