సైబర్ మోసాల బారిన పడుతున్న విద్యావంతులు మరియు నిపుణులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

సైబర్ మోసాల బారిన పడటంలో విద్యావంతులు, సాంకేతిక నిపుణులకు కూడా మినహాయింపు లేదని ఐఐటీ మద్రాస్ అధ్యయనంలో వెల్లడైంది. డిజిటల్ అక్షరాస్యత లోపం కంటే భయం, ఆందోళనలను సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఆసరాగా చేసుకుంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఐటీ నిపుణులు, బ్యాంకర్లు, వైద్యులు సైతం ఈ మోసాలకు బలవుతున్నారని ప్రొఫెసర్ నందన్ సుదర్శనం తెలిపారు. బాధితులు కొద్ది వేల రూపాయల నుండి కోటి రూపాయలకు పైగా నష్టపోయినట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.