సినీ ప్రియులకు గుడ్ న్యూస్: వైవిధ్యమైన పాత్రలతో అగ్రశ్రేణి కొత్త వెబ్ సిరీస్ ప్రారంభం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా వైవిధ్యమైన తారాగణంతో సరికొత్త వెబ్ సిరీస్ పూజా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. రాజేష్ సెల్వ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు చేస్తున్నారని స్పష్టం చేశారు.