తీవ్ర తుఫాను ముప్పు: నెల్లూరు, నరసాపురం మధ్య మంగళవారం తీరం దాటనున్న మురసు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మురసు తుపానుగా బలపడి రాష్ట్రం వైపు దూసుకొస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. సోమవారానికి తీవ్ర తుపానుగా మారి మంగళవారం నెల్లూరు, నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.