పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజుపై భారీ అంచనాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ప్రత్యేక అప్ డేట్లు రానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా నుంచి గ్లింప్స్ లేదా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రం నుంచి కాన్సెప్ట్ పోస్టర్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ బర్త్ డేకు మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది.