తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్న టీడీపీ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి అర్బన్

తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ జేబీ శ్రీనివాస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తారు. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అర్జీలతో నేరుగా వచ్చి ఆయనను కలవవచ్చు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని పార్టీ నాయకులు కోరారు.