పులివెందులలో జగన్ కాన్వాయ్ అడ్డగింత: కలకలం సృష్టించిన దస్తగిరి నిరసన

రిపోర్టర్: కిరణ్ స్థలం: పులివెందుల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. హెలిప్యాడ్ నుంచి నివాసానికి వెళ్తున్న ఆయన కాన్వాయ్ను వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి అడ్డుకున్నారు. మా జీవితాలను నాశనం చేశావంటూ జగన్ ఎదుటే ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే దస్తగిరిని పక్కకు లాగి అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు.