హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా సాధారణ సెలవు ప్రకటన

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 25న శుక్రవారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో ఆర్టీ నెం.1396ను విడుదల చేశారు. అయితే, ఆ సెలవుకు బదులుగా నవంబర్ 14 రెండో శనివారం పనిదినంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.