భక్తిశ్రద్ధలతో మురిసిపోయిన బంగారిగడ్డ గణపతి పూజలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బంగారిగడ్డ కాలనీలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో తొలిరోజు గణపతి పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్సవ కమిటీ చిన్నారులు, కాలనీవాసులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మైలారం మనస్విని, శశాంక్, గ్రీష్మిక, వైవాంక్ష్, మనసుక్ రెడ్డితో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.