తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక లగేజీ కౌంటర్ల ఏర్పాటు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Tirumala

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ వద్ద లగేజీ, సెల్ ఫోన్లను తిరిగి పొందేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఎక్కడ డిపాజిట్ చేసినా తమ లగేజీ, సెల్ ఫోన్లను ఒకే చోట సులభంగా తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఈ నూతన సదుపాయం ద్వారా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.