రాజాంలో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులతో మట్టి విగ్రహాల తయారీ
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయనగరం
రాజాం మండలం కంచరాం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనాడు-వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పర్యావరణానికి జరిగే నష్టాన్ని వివరించి, విద్యార్థులతో స్వయంగా సుమారు 100 మట్టి ప్రతిమలు చేయించి పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు.