పాన్ ఇండియా చిత్రంగా రాఘవ లారెన్స్ కర్ణ
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
మహాభారతంలో వీరత్వం, దానగుణానికి ప్రతీక అయిన కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కర్ణ అధికారికంగా ప్రకటించబడింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ చారిత్రాత్మక విజువల్ వండర్ చిత్రాన్ని జయంతిలాల్ గడా సమర్పణలో ఆర్వీ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.