మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనేనంటూ సత్యప్రసాద్ సంచలన వాంగ్మూలం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

వైకాపా హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని ఏపీఎస్‌బీసీఎల్‌ అప్పటి ప్రత్యేకాధికారి డి.సత్యప్రసాద్ విజయవాడ ఏసీబీ కోర్టులో అప్రూవర్‌గా వాంగ్మూలమిచ్చారు. మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన రూ.3,200 కోట్లకు పైగా లంచాల సొమ్మును వైఎస్‌ అనిల్‌రెడ్డి, గోవిందప్ప బాలాజీ, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా జగన్‌కు చేరవేసేవారని ఆయన వెల్లడించారు.