లండన్లో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత వాషు భగ్నాని
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ముంబై
ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాత వాషు భగ్నాని లండన్లో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని మీడియా వర్గాలు వెల్లడించాయి. ముంబైలో ఆదాయపు శాఖ అధికారులు ఆయనకు చెందిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.