పాప్ రారాజు మైకెల్ జాక్సన్ ఆస్తి కోసం కూతురు పారిస్ న్యాయపోరాటం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Los Angeles
మైకెల్ జాక్సన్ ఆస్తిలో నుంచి ఆరు వందల మిలియన్ డాలర్లను కుటుంబ ట్రస్ట్ కు బదిలీ చేయాలని ఆయన కూతురు పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పీపుల్ మ్యాగజైన్ వెల్లడించింది. ఎస్టేట్ నుంచి బిలియన్ల ఆదాయం వస్తున్నప్పటికీ ట్రస్ట్ కు నిధులు కేటాయించలేదని, పన్ను వివాదాల పేరుతో ఎస్టేట్ ఎగ్జిక్యూటర్లు జాప్యం చేస్తున్నారని ఆమె తన న్యాయపోరాటంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు.