ప్రజానిమిత్తం ఇరవై ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేసుకున్న మోదీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమై భారత ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జ్యోతి గ్రామ యోజన, వైబ్రెంట్ గుజరాత్ నుండి జనధన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల, గరీబ్ కళ్యాణ్ అన్న, మేక్ ఇన్ ఇండియా వంటి అనేక సంక్షేమ పథకాలు, విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా దేశ నిర్మాణానికి ఆయన కొత్త వేగాన్ని అందించారని, చరిత్ర సృష్టించారని ప్రశంసలు వెల్లువెత్తాయి.