నక్కవాగు నీటి తరలింపు: కోవలెంట్ కంపెనీ అక్రమాలపై స్థానికుల ఆగ్రహం

రిపోర్టర్: రమేష్ స్థలం: సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలోని నక్కవాగు నుంచి కోవలెంట్ కంపెనీ యాజమాన్యం అక్రమంగా నీటిని తరలిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మోటార్లతో నీటిని తోడుకుంటూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలిగిస్తున్న ఈ వ్యవహారంపై ఇరిగేషన్, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే స్పందించి సంయుక్త తనిఖీలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.