సెన్సార్ తీరుపై నారాయణమూర్తి ఆగ్రహం: సినిమాల పట్ల వివక్ష తగదని ఫైర్
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
సినిమాల పట్ల సెన్సార్ బోర్డు విపక్ష వైఖరి ప్రదర్శిస్తోందని ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన కామ్రేడ్ కల్యాణ్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, బస్తర్, కశ్మీర్ ఫైల్స్ చిత్రాలకు లేని అడ్డంకులు ప్రభుత్వ వ్యతిరేక సినిమాలకే ఎందుకని ప్రశ్నించారు. నక్సలైట్లు ఈ దేశ భూమిపుత్రులని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను సెన్సార్ అధికారులు విస్మరించకూడదని ఆయన తీవ్రస్థాయిలో హితవు పలికారు.