జూట్ మిల్ భూముల కబ్జాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోట అప్పన్న డిమాండ్

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

బొబ్బిలి పట్టణంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్ భూముల్లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించి ప్రహరీ గోడ నిర్మించిన ఆక్రమణదారులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ సుబ్బారావుకు సీపీఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో యంత్రాగం విఫలమైతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.