ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.5,052 కోట్ల నిధులు సమీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎత్తిపోతల పథకాలను బాగుచేయడంతో పాటు నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు రూ.5,052 కోట్ల నిధులను నాలుగు మార్గాల ద్వారా తక్షణం సమీకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ స్థలాల్లో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టును చేపట్టి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వయబిలిటీ గ్యాప్ ఫండ్స్, రుణాలు మరియు ఆపరేటర్ పెట్టుబడి ద్వారా ఈ నిధులు సమకూర్చాలని ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.