ఏపీ స్థానిక ఎన్నికలపై వైసీపీకి హైకోర్టులో మరో భారీ షాక్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను కేంద్ర బలగాల భద్రత నడుమ నిర్వహించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును సమర్థిస్తూ న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు అభ్యర్థుల రక్షణకు తీసుకుంటున్న పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.