మొబైల్ వినియోగదారులకు ముప్ఫై రోజుల వ్యాలిడిటీతో రీచార్జ్ ప్లాన్లు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ముప్ఫై రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త రీచార్జ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నట్లు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వెల్లడించారు. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. ఏడాదిలో పదమూడు సార్లు నెలవారీ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పన్నెండు రీచార్జ్లతో సరిపెట్టుకునేలా కొత్త నిబంధనలు తెచ్చినట్లు పేర్కొన్నారు. డేటా అవసరం లేని వారి కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలతో ప్రత్యేక ప్లాన్స్ కూడా రానున్నాయని ఆయన స్పష్టం చేశారు.