గుర్గావ్‌లో బైకర్ సియాపై హిట్ అండ్ రన్ కేసు నమోదు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హర్యానా

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో బైకర్‌గా వెళ్తున్న సియాపై జరిగిన హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న నలుగురు వ్యక్తులు కారులో వెంబడించి అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలి సోదరుడు ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని, త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.