విజయవాడ సమీపంలో దారుణ హత్యకు గురైన మహిళ మృతదేహం గుర్తింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
మంగళగిరికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల కల్యాణిని హత్య చేసి శరీర భాగాలుగా నరికినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్ కూలింగ్ కాలువలో లభించిన శరీర భాగాలు కల్యాణివిగా ఆమె చేతిపై ఉన్న టాటూ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భర్తతో విడిపోయి ఓ హోటల్లో పనిచేస్తున్న ఆమెను ఈ నెల పదిహేడో తేదీన హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.