ఆరు గ్యారంటీలు అమలు చేయాలని అధికారులకు వినతి

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి విఫలమైందని మండల పార్టీ అధ్యక్షులు తుళ్ళ కుమారస్వామి మండిపడ్డారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకొని అక్రమ అరెస్టు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.