ఒకే వేదికపైకి చేరి సందడి చేసిన అక్కినేని కుటుంబ సభ్యులు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాదు
దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి సంబంధించిన ఫొటోను నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఇది నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రత్యేక సందర్భాలలో అందరూ కలిసి వేడుకలు జరుపుకోవడం విశేషమని, కుటుంబ సభ్యులందరూ కలిసి ఏఎన్‌ఆర్‌కు ఘన నివాళులు అర్పించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.