కాంగోలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు మృతి

రిపోర్టర్: సతీష్ స్థలం: World

కాంగోలోని బుకావు నగరంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 26 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. ఓ ఇంట్లో మొదలైన మంటలు పక్కనే ఉన్న రెండు పాఠశాలలకు వ్యాపించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో 19 మంది బాలికలు, ఏడుగురు బాలురు ఉన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం, ఇళ్లు చెక్కతో నిర్మించడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.