దుబాయ్ లో సరికొత్త ప్రయోగం: పార్కుల్లోనే ప్రత్యేక వర్క్ స్పేస్ ల ఏర్పాటు
రిపోర్టర్: సునీల్
స్థలం: దుబాయ్
దుబాయ్ లోని అల్ బర్షా పాండ్ పార్కులో సరికొత్తగా వర్క్ ఫ్రమ్ పార్క్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. వృత్తి నిపుణుల కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఉచిత బహిరంగ సీటింగ్ తో పాటు పెయిడ్ ఇండోర్ కో-వర్కింగ్ స్పేస్ లు, మీటింగ్ రూమ్ లు అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు. ప్రజా ప్రదేశాలను ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.