చెంగిచర్ల కబేళా వద్ద భారీ రద్దీ: తక్కువ ధరకు మటన్ కోసం పోటెత్తిన జనం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
దసరా పండుగ వేళ భాగ్యనగర శివార్లలోని చెంగిచర్ల కబేళా వద్ద మటన్ కొనుగోలు చేయడానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. నగరంలో కిలో మటన్ రూ. 800 నుంచి వేయి రూపాయల వరకు పలుకుతుండగా, ఇక్కడ కేవలం రూ. 500 నుంచి రూ. 700 మధ్యే లభించడంతో కొనుగోలుదారులు బారులు తీరారు. ఒక్కసారిగా వేలాది మంది వాహనాలతో రావడంతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.