డ్రోన్లను కూల్చేయడానికి రంగంలోకి భారత్ స్వదేశీ లేసర్ ఆయుధం
రిపోర్టర్: శివ
స్థలం: India
భారత దేశం తన స్వదేశీ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సామర్థ్యాన్ని పరీక్షల దశ నుండి ఉత్పత్తి దశకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ త్వరలో ముప్పై కిలోవాట్ల శ్రేణి గల కౌంటర్ డ్రోన్ లేసర్ ఆయుధం కోసం పరిశ్రమ భాగస్వామిని ఆహ్వానించనుంది. ఐదు కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్ గుంపులను ఎదుర్కొనేందుకు ఈ ట్రక్కుపై అమర్చిన లేసర్ సిస్టమ్ రూపకల్పన చేశారు. ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి దీని తుది పరీక్షలు పూర్తయ్యాయి.