చాయ్ జాలిలో అద్భుతంగా సాక్షాత్కరించిన గణనాథుని దివ్య రూపం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద ఉన్న ఏ వన్ టీ స్టాల్లో శుక్రవారం సాయంత్రం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. టీ తయారు చేసి జాలి పెట్టి వడపోసిన తర్వాత చాయ్ పత్తిలో వినాయకుడి ఆకారం స్పష్టంగా కనిపించడంతో హోటల్ నిర్వాహకుడు ముస్లిం తక్వేర్ ఆశ్చర్యపోయారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.