ఆస్కార్ విజేత, ప్రముఖ చలనచిత్ర నిర్మాత జెరెమీ థామస్ కన్నుమూత.

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

ప్రముఖ ఆస్కార్ విజేత, లెజెండరీ చలనచిత్ర నిర్మాత జెరెమీ థామస్ (77) ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 'ది లాస్ట్ ఎంపరర్', 'సెక్సీ బీస్ట్' వంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.