పాకిస్థాన్ క్రికెటర్లు రిజ్వాన్, ఇమామ్‌లకు సైబర్ క్రైమ్ నోటీసులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: World

పాకిస్థాన్ క్రికెటర్లు మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్ లకు నేషనల్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది. మొబైల్ ఫోన్లలోని సమాచారం ఆధారంగా వీరిని విచారించారు. డ్రెస్సింగ్ రూమ్ లీక్ ల వివాదంపై ఈ విచారణ జరుగుతోంది. అలాగే ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేయకపోవడంతో ప్రెసిడెంట్స్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌లకు కూడా ఇద్దరూ దూరమయ్యారు.