ప్రాంతంలో విద్యుత్ కోతలపై అధికారులను నిలదీసిన టీడీపీ నేతలు

రిపోర్టర్: katikapalli perumal స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధిలో గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో పట్టణ తెలుగుదేశం నాయకులు విద్యుత్ విభాగ అసిస్టెంట్ ఇంజనీర్ బాలచందర్ ను కలిసి వివరాలు అడిగారు. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గడం వల్లనే సమస్య తలెత్తిందని, త్వరలోనే ఇబ్బందులు తొలగిపోతాయని అధికారులు తెలిపారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.