గంగమ్మ జాతర వేళ నిరంతర విద్యుత్ అందించాలని విజ్ఞప్తి
రిపోర్టర్: katikapalli perumal
స్థలం: నగరి
నగరి మున్సిపల్ పరిధిలోని పట్టణంలో మరియు చుట్టుపక్కల పదిహేడు గ్రామాలలో గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం నుండి శుక్రవారం వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవాల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులను కోరారు. ఉన్నత అధికారులతో మాట్లాడి జాతర సమయంలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించాలని విజ్ఞప్తి చేయగా, అధికారులు సానుకూలంగా స్పందించి హామీ ఇస్తామని తెలిపారు.