కలకలం: పానీపూరీ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల డి తనిఖీలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని గౌలిపుర, మలక్‌పేట, జియాగూడ మరియు బడంగ్‌పేట ప్రాంతాల్లోని పన్నెండు పానీపూరీ తయారీ కేంద్రాలపై తెలంగాణ సేఫ్టీ ఫుడ్ వింగ్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారని సుధాకర్ ఉడుముల (Sudhakar Udumula - TOI Investigative Editor) వెల్లడించారు. ఈ తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్ర వాతావరణం బయటపడిందని, కార్మికులు ఎలాంటి గ్లౌజులు, క్యాప్‌లు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన దుస్తులతో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు.