పలాస రైల్వే స్టేషన్లో మహిళా టికెట్ కలెక్టర్‌పై ప్రయాణికుడి దాడి
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న మహిళా టికెట్ కలెక్టర్ సుజాతపై ప్రయాణికుడు దాడి చేశాడు. బరంపురంనకు చెందిన ప్రయాణికుడు టికెట్ అడిగినందుకు దురుసుగా సమాధానం చెప్పి ఆమె చెంపపై కొట్టాడు. అప్రమత్తమైన స్థానికులు, తోటి సిబ్బంది వెంటనే ఆ ప్రయాణికుడిని పట్టుకుని రైల్వే పోలీసులకు అప్పగించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.