అక్టోబర్ 1 నుంచి ఈకేవైసి ఉంటేనే రాయితీ వంటగ్యాస్ సిలిండర్
రిపోర్టర్: శివ
స్థలం: India
గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు రాయితీపై పొందాలంటే అక్టోబర్ 1వ తేదీలోగా ఈకేవైసి పూర్తి చేయడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ రాయితీ ప్రయోజనం అందేలా చూడటంతో పాటు సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 89.9 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగిలిన వారు డెలివరీ సిబ్బంది ద్వారా లేదా సంబంధిత మొబైల్ యాప్ల ద్వారా ఈకేవైసి పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.